హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంత్యుత్సవాలను తెలంగాణ భవన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. శతజయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజు, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు దాశరథి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దాశరథి కృష్ణమాచార్య తన రచనలతో తెలంగాణ జాతిని జాగృతం చేశారని కొనియాడారు. నేటి తరం ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, దేవీప్రసాద్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఆయాచితం శ్రీధర్, గజ్జెల నగేశ్, ప్రేమ్‌కుమార్, పల్లె రవికుమార్‌గౌడ్, ప్రేమ్‌కుమార్ ధూత్, నరేందర్, కోతి కిశోర్‌గౌడ్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, మన్నె కవిత, సుమిత్రా ఆనంద్, కిర్తీలత తదితరులు పాల్గొన్నారు.