అభ్యర్థిని ప్రకటించే దాకా మాకే తెలియదు!

- హుజూరాబాద్ దరఖాస్తుదారుల ఎదుట
- దామోదర రాజనర్సింహ ఆవేదన
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో తమ తప్పేమీ లేదనీ, అంతా ఆయనే (రేవంత్‌రెడ్డి) నిర్ణయించాడని, అభ్యర్థిని ప్రకటించేదాకా తమకు కూడా తెలియదని టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ వాపోయినట్టు తెలిసింది. అసంతృప్తితో రగిలిపోతున్న హుజూరాబాద్ నేతల ఎదుట ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సీనియర్లు ఎదుర్కొంటున్న దుస్థితిని సూచిస్తున్నాయి. పీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడలతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారన్న విమర్శలకు హుజూరాబాద్ వ్యవహారం మరింత బలాన్నిస్తున్నది. పీసీసీ సూచన మేరకు 18 మంది అభ్యర్థులు ఉప ఎన్నికలో పోటీ చేస్తామని దరఖాస్తులిచ్చారు. స్థానిక నేతలతో చర్చించిన ఎన్నికల కమిటీ ముగ్గురి పేర్లను సిఫారసు చేసింది. వీటిని పట్టించుకోని రేవంత్‌రెడ్డి స్థానికేతురుడైన బల్మూర్ వెంకట్ పేరును ఖరారు చేశారు. దరఖాస్తులు తీసుకొని, తమను అవమానించారనే కోపంతో రగిలిపోతున్న స్థానికనేతలు రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెప్పాలనే నిర్ణయానికొచ్చారు. దీంతో వారిని బుజ్జగించేందుకు మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి వారితో చర్చలు జరిపిన రాజనర్సింహ అభ్యర్థి ఎంపిక విషయంలో తన అసహాయతను వ్యక్తం చేయడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

