వరంగల్ : ఆర్మీ అభ్యర్థి దామెర రాకేశ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య దబీర్పేట వైకుంఠధామంలో ముగిశాయి. రాకేశ్ పాడెను మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మోసి శ్రద్ధాంజలి ఘటించారు. రాకేశ్ అంతిమయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో రాకేశ్ మృతి చెందిన సంగతి తెలిసిందే.
బీజేపీ విధానాలు, ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పులను నిరసిస్తూ రాకేశ్ అంతిమయాత్రలో నల్లజెండాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. వరంగల్ ఎంజీఎం నుంచి ధర్మారం, నర్సంపేట అయ్యప్ప స్వామి ఆలయం, పాకాల సెంటర్ మీదుగా ఖానాపూర్ మండలం దబీర్పేట వరకు రాకేశ్ అంతిమయాత్ర కొనసాగింది.
ఆర్మీ అభ్యర్థి దామెర రాకేశ్ అంతిమయాత్రలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొని నివాళులర్పించారు. రాకేశ్ పాడెను కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు మోసుకెళ్లారు. pic.twitter.com/NEYosgXKQ8
— Namasthe Telangana (@ntdailyonline) June 18, 2022