హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తె లంగాణ): హిందు, ముస్లింల మధ్య విభజన రాజకీయాలు దేశానికి నష్టం చేకూరుస్తాయని, దేశాన్ని మరింత బలహీనపరుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ విద్యాదినోత్సవం, మైనా ర్టీ సంక్షేమ దినోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో హిందువులు, ముస్లింలను తమ ప్రభుత్వం రెండు కండ్లలా భావిస్తున్నదని చెప్పారు.
దేశంలో ఆధునిక విద్యకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బలమైన పునాది వేశారని, నెహ్రూ నాయకత్వంలో 11 ఏండ్లపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా దేశానికి అత్యుత్తమ విద్యావిధానాన్ని అం దించారని గుర్తుచేశారు. మైనార్టీ గురుకులా లు రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించా రు. అబుల్‌కలాం ఆజాద్, ముఖ్దూమ్, లైఫ్‌టైమ్ అవార్డులను పలువురికి సీఎం అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.