e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home Top Slides లక్ష కోట్ల దళిత బంధు

లక్ష కోట్ల దళిత బంధు

  • అర్హులందరికీ దశలవారీగా అమలు
  • వివక్షల నుంచి విముక్తి చేసే పథకం
  • దేశానికే ఆదర్శంగా దళిత బంధు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి
  • సీఎంకు ధన్యవాదాలు చెప్పేందుకు
  • తరలొచ్చిన హుజూరాబాద్‌ ప్రజలు
  • ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా
  • శ్రీనివాస్‌కు అభినందన కార్యక్రమం

దళిత బంధు విజయవంతానికి ప్రతి దళితబిడ్డ పట్టుబట్టి పనిచేయాలె. ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్‌ పుట్టాలె. హుజూరాబాద్‌లో విజయవంతం కావడం ద్వారా ప్రసరించే వెలుగు, తెలంగాణ సహా, దేశవ్యాప్తంగా విస్తరించాలె. దళిత బంధును కూడా కొందరు అనుమాన పడుతున్నరు. వారి అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తం. రైతు బంధు స్ఫూర్తితో దళిత బంధును అమలుచేస్తం. విజయం సాధిస్తం.

ఇన్నాళ్లూ ఏవేవో పథకాలు తెచ్చి, బ్యాంకుల గ్యారెంటీ అడిగినయి ప్రభుత్వాలు. కాళ్లు చేతులే ఆస్తులుగా ఉన్న కడుపేద దళితులు గ్యారెంటీలు ఎకడ తెస్తరు? దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం చేసే ఆర్థికసాయం పూర్తిగా ఉచితం. ఇది అప్పుకాదు. తిరిగి ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో దళారుల మాటే ఉండదు. నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ఆర్థిక సాయం వచ్చి చేరుతుంది.

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌
- Advertisement -

హైదరాబాద్‌, జూలై 24 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభయమిచ్చారు. కాళ్లు, రెకలే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యంగా, రాష్ట్రంలోని అర్హులందరికీ దశలవారీగా ఈ పథకాన్ని అమలుచేస్తామని భరోసా ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు, శనివారం ప్రగతిభవన్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా బండా శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి శాలువాతో సతరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్న దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలువబోతున్నదన్నారు. ఇది దేశంలోని దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేసే పథకంగా మారాలని ఆకాంక్షించారు. పథకాన్ని విజయవంతం చేసేందుకు అందరం కలిసి, పట్టుదలతో కృషిచేద్దామని దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాలకు పిలుపునిచ్చారు.

దళితుల అభివృద్ధినీ ఉద్యమంలా..
దళిత బంధు విజయవంతానికి ప్రతి దళితబిడ్డ పట్టుబట్టి పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ‘ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్‌ పుట్టాలె’ అన్నారు. హుజూరాబాద్‌లో విజయవంతం కావడం ద్వారా ప్రసరించే వెలుగు, తెలంగాణ సహా, దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో దళితుల అభివృద్ధిని తెలంగాణ ఉద్యమంలా చేపట్టాలని కోరారు. రాజులు, జాగీర్దార్లు, జమీందార్లు, భూస్వాములు, వలస పాలకులు, ఇట్లా వందేండ్లపాటు అనేక రకాల పీడనను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నారని చెప్పారు. అన్ని రంగాలను ఒకొకటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామని, తెలంగాణ గాడిలో పడిందని పేర్కొన్నారు.

అదే స్ఫూర్తితో దళిత బంధు
ఉద్యమం ప్రారంభించిన మొదట్లో తెలంగాణ వస్తదా? అని అనుమానపడ్డరు. వచ్చింది. ఇరువైనాలుగు గంటలు కరెంటు అయ్యేదా పొయ్యేదా? అన్నరు. అయ్యింది. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు అయితదా! అన్నరు. అయింది. దండుగన్న వ్యవసాయం పండుగైంది. రైతుబంధు తెచ్చినప్పుడు కొందరు పెదవి విరిచిన్రు. తెలంగాణ రైతు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నడు. దళిత బంధును కూడా కొందరు అనుమాన పడుతున్నరు. వారి అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తం. అదే స్ఫూర్తితో దళిత బంధును అమలుచేస్తం. విజయం సాధి స్తం’ అని సీఎం స్పష్టంచేశారు.

సభికులతో ప్రతిజ్ఞ చేయించిన సీఎం
దళితబంధును విజయవంతం చేయ డం ద్వారా, తెలంగాణకే కాదు దేశంలోని దళితుల అభివృద్ధికి హుజూరాబాద్‌ దళితులు దారులు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. అందుకు పునాది వేద్దామని సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ ప్రజలు గత పాలనలో గొర్రెల మందలో చికుకున్న పులిపిల్లలాంటి వాళ్లనే సంగతిని స్వయంపాలన ఏర్పాటయినంక ప్రపంచం పసిగట్టిందని సీఎం వివరించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం నేడు నివ్వెర పోతున్నదన్నారు. తెలంగాణ రైతాంగం రోహిణి కార్తెలోనే నాట్లేసుకునే రోజులొచ్చినయని పేర్కొన్నారు. సమాజాన్ని పీడిస్తున్న వరకట్నం, అంటరానితనం వంటి వివక్షలను విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ద్వారా సాధించవచ్చునని చెప్పారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితర అభాగ్యులకు ప్రభు త్వం ఆసరాగా నిలిచిందని, వారి కండ్లల్లో సంతోషం కనిపిస్తున్నదని, అదే రీతిలో దళిత సమాజం మోములో ఆనందాన్ని చూడాలన్నదే తన పట్టుదల అని చెప్పారు. తాను పార్టీ పెట్టిన నాటినుంచి ఎంతో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తున్న బండ శ్రీనివాస్‌కు పదవి మాత్రమే ఇవ్వలేదని, తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఆయన నెత్తిన పెద్ద బాధ్యతతో కూడిన ‘బండ’ పెట్టానని సీఎం చమత్కరించడంతో సభలో నవ్వులు విరిశాయి.

కాళ్లు, చేతులే దళితుల ఆస్తి
‘ఇన్నాళ్లూ ఏవో పథకాలు తెచ్చి, బ్యాం కు గ్యారెంటీ అడిగినయి ప్రభుత్వాలు. కాళ్లు చేతులే ఆస్తులుగా ఉన్న కడుపేద దళితులు గ్యారెంటీలు ఎకడ తెస్తరు? దళితబంధు ద్వారా ప్రభుత్వం చేసే ఆర్థికసాయం పూర్తి గా ఉచితం. ఇది అప్పుకాదు. తిరిగి ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో దళారుల మాటే ఉండదు. నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకులో ఆర్థిక సాయం వచ్చి చేరుతుంది’ అని సీఎం స్పష్టంచేశారు.

హుజూరాబాద్‌ బిడ్డలుగా గర్వపడాలి
స్వాతంత్య్రం వచ్చిననాడు అంబేదర్‌ దళిత బహుజనవర్గాల కోసం కొట్లాడారని, ఆ తర్వాత బడుగుల బాగును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని సీఎం పేర్కొన్నారు. గాం ధీజీ, అంబేదర్‌ వేసిన బాటలో ప్రభుత్వం నడుస్తున్నదని, వారి ఆశయాలను, దళితుల అభివృద్ధిని సాధించి తీరుతామని స్పష్టంచేశారు. తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రా లు ఆదర్శంగా తీసుకున్నాయని, దళిత బం ధు కూడా దేశానికి ఆదర్శంగా మారుతుందని అన్నారు. ‘ఎకడో ఒక దగ్గర ప్రేరణ కావాలి. అది హుజూరాబాద్‌ అవుతున్నందుకు ఆ గడ్డమీది బిడ్డలుగా మీరందరూ గర్వపడాలి’ అని సీఎం అన్నారు.

తెలంగాణ ఉద్యమంలా..
దళిత బంధు పథకం మాత్రమే కాదని, తెలంగాణ ఉద్యమం మాదిరి దళితుల అ భ్యున్నతి కోసం సాగే ఉద్యమం అని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ఒక దీపం ఇం కో దీపాన్ని వెలిగించినటు,్ట ఒకరి అభివృద్ధి కోసం మరొకరు పాటుపడే యజ్జం అన్నా రు. సమావేశంలో ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, హుజూరాబాద్‌ జడ్పీటీసీ బకారెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర దళిత సంఘాల నేతలు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

పైసను పెట్టి పైసను సంపాదించే మార్గం అన్వేషించాలి
దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధీమా ను పెంచి తమ అభివృద్ధిని తామే నిర్వచించుకోగలం అనే భరోసాను కలిగించే ప్రయత్నమే దళిత బంధు పథకం అని సీఎం తెలిపారు. ఇచ్చిన పైసలు పప్పులు, పుట్నాలకు ఖర్చు చేయకుండా, పైసను పెట్టి పైసను సం పాదించే ఉపాధి, వ్యాపారమార్గాల ను అన్వేషించాలని, అందుకు అంద రూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.

ఖోజా జాతి మనందరికీ ఆదర్శం
దళిత బంధుతో మంచి జరిగి వెలుతురొస్తే.. అణగారిన దళిత వర్గాలందరికీ మేలు జరిగి ఒక తొవ్వ పడుతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇదంతా హుజూరాబాద్‌ దళిత నాయకుల పట్టుదల, నిబద్ధ్దత, చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉన్నదన్నారు. పార్టీలకతీతంగా దళిత బంధును అమలు చేసుకుందామన్నారు. అందరూ కలిసిమెలిసి అన్నాదమ్ముల వలె, చిరునవ్వులతో పరస్పరం పలకరించుకోవాలని కోరారు. కొట్లాటలు, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు లేని వాడలుగా దళితవాడలు పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులను ఎత్తేసుకోవాలని సూచించారు. ఒకరు కిందపడితే వెంటనే ఆదుకొనే ఖోజా జాతి అందరికీ ఆదర్శం కావాలన్నారు. దళితజాతిలో ఇక ఎవ్వరూ పేదలుగా మిగలకూడని సీఎం ఆకాంక్షించారు.

దళిత బంధు పెద్ద మిషన్‌
26న ప్రగతిభవన్‌ సదస్సుకు రండి
తనుగుల ఎంపీటీసీ భర్తకు సీఎం ఫోన్‌

హైదరాబాద్‌, జూలై 24 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకం పెద్ద మిషన్‌ అని, ప్రాణం పోయినా దాని అమలు నుంచి వెనక్కి తగ్గేది లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. శనివారం హుజురాబాద్‌ నియోజకవర్గంలోని తనుగుల ఎంపీటీసీ భర్త వాసాల రామస్వామికి సీఎం స్వయంగా ఫోన్‌ చేశారు. దళితబంధు పథకంపై ఈ నెల 26న ప్రగతిభవన్‌లో నిర్వహించనున్న అవగాహన సదస్సుకు రావాలని ఆహ్వానించారు. పథకాన్ని విజయవంతం చేసి దేశానికే ఆదర్శంగా నిలుద్దామని, ప్రపంచానికి గొప్ప సందేశమిద్దామని పిలుపునిచ్చారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana