పక్కాగా కొనసాగుతున్న సర్వే: మంత్రి కొప్పుల ఈశ్వర్
హుజూరాబాద్ రూరల్/ జమ్మికుంట, ఆగస్టు 31: రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో సర్వేను ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్తో కలిసి పరిశీలించారు. జమ్మికుంటలోని గణేశ్నగర్ను సందర్శించి దళితులతో మాట్లాడారు. సిర్సపల్లిలో లబ్ధిదారులు ఏ యూనిట్ పెట్టుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎల్లవ్వ అనే మహిళ ట్రాలీ కొని నడుపుకొంటామని, దీప్తి అనే యువతి టైలర్ షాపు పెడ్తానని మంత్రి ప్రశ్నలకు బదులిచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు ఉన్నారు.