ధర్మపురి, ఆగస్టు 26 : ఎన్నికల హామీలు, అంబేద్కర్ అభయ హస్తం అమలు చేయాలని, పెండింగ్ దళితబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో ధర్మపురి వద్ద గోదావరి నదిలో రాష్ట్ర ప్రభుత్వానికి పిండ ప్రదానంచేసి వినూత్న నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళితబంధు సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సలహాదార్లు సంజీవ్, బాలనర్సు, రాష్ట్ర కార్యదర్శి మొగిలి, జిల్లా కోఆర్డినేటర్ శంకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.