ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15: గ్రూప్ 1 పరీక్షకు ఎంతమంది హాజరయ్యారో తేల్చి చెప్పాలని దళిత, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్1 పరీక్షలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ ఈ పరీక్షపై అనేక అనుమానాలు ఉన్నాయని, వారం గడుస్తు న్నా అభ్యర్థుల సంఖ్యను చెప్పకపోవడం వె నుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యలోనూ స్పష్టత లేదని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సమీర్, శేఖర్, రాణా తదితరులు పాల్గొన్నారు.