హైదరాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ పాడి రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టే అంశంపై పాడి రైతు సంఘాలు చర్చిస్తున్నట్టు స మాచారం.
బకాయిల విడుదలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో అసెంబ్లీ లేదా సచివాలయాన్ని ముట్టడించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. సుమారు రూ.100 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది.