హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డీ రాజా ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహిస్తున్న సీపీఐ 24వ జాతీయ మహాసభలు మంగళవారం ముగిశాయి. ఈ మహాసభల్లో 125 మందిని జాతీయ సమితి సభ్యులుగా, 31 మందిని కార్యవర్గ సభ్యులుగా, 11 మందిని కార్యదర్శులుగా ఎన్నుకొన్నారు.
బీజేపీకి ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉన్నదని రాజా పేర్కొన్నారు. 2024లో ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. భావ సారుప్యత ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకొనే అధికారం రాష్ట్ర కమిటీలకు అప్పగించినట్టు చెప్పారు.