హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, వరంగల్, హన్మకొండ, ములు గు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్రలో మాత్రం భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి
దసరా, దీపావళికి 12 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): దసరా, దీపావళి నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి శ్రీ కాకుళం మధ్య 12 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 7 వరకు నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, విజయనగరం మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి.
ఏపీ సీఎంతో మంత్రి ఉత్తమ్దంపతుల భేటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగోసారి సీఎంగా బా ధ్యతలు చేపట్టిన చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలేదని వెల్లడించారు.
ఏపీ సీఎంకు డిప్యూటీ సీఎం పవన్ లేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ రాశారు. మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నానని, విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని, ఫర్నిచర్, సామగ్రిని వెనక్కి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.