హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : దానా తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్టు గురువారం రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నెల 25 నుం చి 27 వరకు హౌరా-సికింద్రాబాద్, పురులియ-తిరునెల్వెలి, కాచిగూడ-యలహంకా రైల్వేస్టేషన్ల మధ్య 4 రైళ్లను రద్దు చేశామని పేర్కొన్నారు. మరోవైపు దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా దాదాపు 804 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు.