హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ) : ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సైక్లిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ (హెచ్‌సీజీ) ఆధ్వర్యంలో సైక్లిస్టులు ఆదివారం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్‌సీజీ ఫౌండర్ నందనూరి రవీందర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉన్నదని తెలిపారు. ప్రజలకు మేలు చేసే ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలని కోరారు. ప్రతి పౌరుడికి ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని చెప్పారు. ఓటును అమ్ముకోవడం చేయకూడదని కోరారు.