నకిరేకల్, ఏప్రిల్ 9: సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని కోరుతూ నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త యేసయ్య ఆదివారం నకిరేకల్ క్యాంపు కార్యాలయం నుంచి హైదరాబాద్‌లోని సచివాలయం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రను మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. యేసయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రధాని అయితే పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెడతారని, రాష్ట్రంలో ని సంక్షేమ పథకాలను దేశమంతా అమలు చేస్తారని ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండ వినయ్‌గౌడ్ పాల్గొన్నారు.