ముషీరాబాద్, ఆగస్టు 2: పారిశుధ్య కార్మికులకు పర్మినెంట్ చేయాలని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టనున్నట్టు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. శనివారం విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
రాష్ట్రంలో నూటికి 80శాతం దళిత పేదవర్గాలు పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్నారని, కనీసం మూడుపూటల తిండి. గూడు లేని జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచ దినోత్సవం సందర్భంగా కార్మికుల సమస్యల సాధనకు సైకిల్ యాత్ర చేపడుతున్నట్టు స్పష్టంచేశారు. నెలరోజులపాటు ఈయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.