Pending Challans | సైబర్ నేరగాళ్ల నయా మోసం.. నకిలీ వెబ్‌సైట్‌తో పెండింగ్ చలాన్ల వసూళ్లు
రాష్ట్రంలోని వాహనాల పెండింగ్ చలాన్లపై (Pending Challans) ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గత నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల చెల్లింపునకు అకాశం కల్పించింది.
హైదరాబాద్: రాష్ట్రంలోని వాహనాల పెండింగ్ చలాన్లపై (Pending Challans) ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గత నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల చెల్లింపునకు అకాశం కల్పించింది. దీంతో వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తున్నది. ఇప్పుడు దీనిని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను కేటుగాళ్లు మోసంచేస్తున్నారు. www.echallantspolice.in పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి చలాన్లు వసూలు చేస్తున్నారు. గుర్తించిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు.
నకిలీ వెబ్సైట్లో పేమెంట్స్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. పేటీఎం, మీసేవా కేంద్రాల్లో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేయాలని సూచించారు. అదేవిధంగా www.ehallan.tspolice.gov.in/publicview వెబ్సైట్లో చెల్లించాలని తెలిపారు. నకిలీ వెబ్‌సైట్‌ను ఎవరు సృష్టించారనే విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్‌లు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లకు 60 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీని ప్రకటించారు. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉండటంతో పోలీసుశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది. నిరుడు రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల ఆదాయం సమకూరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

