హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానా శ్రయం వద్ద గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లకు పెంచుతున్నట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గెలాక్సీ మెయిన్ గేట్ నుంచి ఎయిర్‌పోర్టు రేర్ గేట్ వరకు ఆరు కిలోమీటర్ల మేర 60 అడుగుల రోడ్డు బాగున్నదని, మీడియన్లు కూడా ఉన్నాయని తెలిపారు.
వేగ పరిమితి పెంచిన రూట్లో ఆటోమేటిక్ స్పీడ్ గుర్తింపు బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ డాటా నేరుగా స్పీడ్‌ను గుర్తించే కెమెరాలతో పోలీస్ డాటాకు అనుసంధానమై ఉంటుందని తెలిపారు. స్పీడ్ పెంచేందుకు ఆయా విభాగాలు సైతం విమానాశ్రయం మెయిన్ రోడ్డులో స్పీడ్ పెంచేందుకు ఆయా విభాగాలు కూడా నిరభ్యంతరం వ్యక్తం చేశాయని సీపీ వెల్లడించారు.