హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. సైబర్ నేరస్థులు ఏడు నెలల్లో 189 కేసుల్లో సుమారు రూ.92 కోట్లు దోచుకున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిలో 228 మందిని అరెస్ట్ చేసినట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుల్లో 49 మంది సాధారణ గ్రాడ్యుయేట్లు, 18 మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు, ఒకరు లా గ్రాడ్యుయేట్ ఉన్నట్టు చెప్పారు.
పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరగాలని రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అధికార సంస్థ చైర్మన్ జస్టిస్ బీ శివశంకర్‌రావు అన్నారు. ఆదివారం బీఆర్కేఆర్ భవన్లో డీ బ్లాక్‌లోని 8వ అంతస్తులో పోలీసు ఫిర్యాదుల అధికార సంస్థ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఎస్పీసీఏ స్వతంత్రంగా పనిచేస్తూ.. డీఎస్పీ లేదా అంతకంటే ఉన్నత ర్యాంకు అధికారిపై ఫిర్యాదు చేయడానికి వేదిక అని తెలిపారు.