హైదరాబాద్, ఏప్రిల్6 (నమస్తే తెలంగాణ): రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కరకట్ట నుంచి నీటి లీకేజీలపై సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) అధ్యయనం చేయనున్నది. ఈ నెల 10న ఇంజినీర్ల బృందం రిజర్వా యర్ను క్షేత్రస్థాయిలో సందర్శించనున్నది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గాలకు సాగు, తాగునీటికి అందించేందుకు గుడ్డందొడ్డిలో రేలంపాడు రిజర్వాయర్ను తొలుత 2.30 టీఎంసీలతో 2011లో నిర్మించారు.
రాష్ట్ర ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4టీఎంసీలకు పెంచింది. 2019 వరకు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీరునిల్వ చేసి వినియోగించారు. ఆ తర్వాత రిజర్వాయర్ నుంచి లీకేజీ ప్రారంభం కావడంతో డ్యామ్సేఫ్టీ అధికారులు సూచనల మేరకు జియోఫిజికల్, టెక్నికల్ పరీక్షలను నిర్వహించారు. సీపేజీని నివారించేందుకు కర్టెన్ గ్రౌడింగ్ చేయాలని నిర్ణయించారు.
అందుకు రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ క్రమంలో మరోసారి అధ్యయనం చేయించాలని నిర్ణయించి.. సీడబ్ల్యూ పీఆర్ఎస్ను సంప్రదించారు. దీనిలో భాగంగా సీడబ్ల్యూపీఆర్ఎస్ ఇంజినీర్ల బృందం రిజర్వాయర్ను సందర్శి ంచనున్నది.