హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై తన సోషల్ మీడియా ఖాతా నుంచి వెళ్లిన ఎమోజీ వివాదంపై రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ స్పందించారు. 2నెలల క్రితం జరిగిన పొరపాటుకు కారణం తన సోషల్ మీడియా హ్యాండ్లర్ అని తెలిపారు.
ఈ విషయం తనకు ఇటీవల వరకు తెలియదని, తెలియగానే ఆ పోస్ట్‌ను తొలగించినట్టు చెప్పారు. దశాబ్దాలుగా బాలకృష్ణతో తనకు పరిచయం ఉన్నదని, ఈ పోస్ట్‌తో ఆయన మనసు నొచ్చుకొని ఉంటే క్షమాపణలు చెప్పడానికి వ్యక్తిగతంగా మెసేజ్ కూడా పెట్టినట్టు స్పష్టంచేశారు.