హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ – యూజీ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలను పెన్, పేపర్ విధానంలో ఈ నెల 24వరకు నిర్వహిస్తారు. సీయూఈటీ యూజీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 380 నగరాల్లో పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది. అభ్యర్థులు ఏ నగరంలో పరీక్ష రాయనున్నరో తెలిపే సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను ఇప్పటికే విడుదల చేసింది.