Uppal Stadium | ఉప్పల్ స్టేడియంలో మళ్లీ కరెంట్ కట్.. ప్రపంచవ్యాప్తంగా పరువు తీస్తున్నాటురంన్న ప్రేక్షకులుఆవేదన
కరెంట్ కోతలు ఉప్పల్ స్టేడియాన్ని వీడటం లేదు. గతంలో హెచ్సీఏ కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్తు సరఫరాను తొలగించామని స్వయంగా విద్యుత్తు అధికారులు చెప్పగా, తాజాగా మరోసారి ఉప్పల్ స్టేడియంలో కరెంట్ సమస్య తలెత్తింది.
- కార్పొరేట్ బాక్సుల్లో గంటకు పైగా అంతరాయం
- నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రేక్షకులు
Uppal Stadium | ఉప్పల్, మే 2 (నమస్తే తెలంగాణ): కరెంట్ కోతలు ఉప్పల్ స్టేడియాన్ని వీడటం లేదు. గతంలో హెచ్సీఏ కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్తు సరఫరాను తొలగించామని స్వయంగా విద్యుత్తు అధికారులు చెప్పగా, తాజాగా మరోసారి ఉప్పల్ స్టేడియంలో కరెంట్ సమస్య తలెత్తింది. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి కరెంట్ సరఫరా లేక అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కార్పొరేట్ బాక్సుల్లో గంటకు పైగా కరెంట్ సరఫరా నిలిచి చీకట్లు అలుముకున్నాయి. ఈ సమయంలో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టి కరెంట్పైకి మళ్లింది. ప్రపంచ దిగ్గజ క్రికెటర్ల ముందు విద్యుత్తు సమస్య తలెత్తడం సిగ్గుచేటని పలువురు చర్చించుకుంటున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొన్నామని, మ్యాచ్ వీక్షిద్దామని వస్తే కరెంట్ లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నామని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలే ఉష్ణోగ్రతలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో కరెంట్ పోవడం తమను మరింత బాధకు గురిచేసిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కరెంట్ ఎందుకు కట్ చేశారంటూ స్టేడియం యాజమాన్యంతో ఘర్షణకు దిగినట్టు తెలిసింది.
గతంలో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, చైన్నె జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కొన్నినెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేసినట్టు ఆనాడు అధికారులు తెలిపారు. రూ.1.57 కోట్లు విద్యుత్తు బిల్లులు హెచ్సీఏ చెల్లించలేదని విద్యుత్ అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

