హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారతదేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) సమ్మిట్‌కు హైదరాబాద్ వేదికకానుంది. నవంబర్ 8న దీన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవిషరించారు.
సమ్మిట్‌లో సామాజిక ఆవిషరణలు, సుస్థిర అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇందులో సీఎస్ఆర్ నిపుణులు, పాలసీ మేకర్లు తదితరులు పాల్గొంటారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ సమ్మిట్ నిర్వహణ కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.