హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాకెట్లు, క్షిపణుల వంటి వాటిలో వినియోగించే ఇంధన వనరులను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ఈ ఇంధనాన్ని దేశీయంగా తయారు చేసుకోగలిగే ఆధునాతన పరిజ్ఞానాన్ని ఐఐసీటీలో రూపొందిస్తున్నారు. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ తో కలిసి ఐఐసీటీ అధిక శక్తి సామర్థ్యం ఉన్న ఇంధన వనరులను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నది. రాకెట్, మిస్సైల్ ప్రొపెలెంట్ సీఎల్-20గా పిలిచే ఇంధనాన్ని తయారు చేయడానికి టైవ్ (TAIW) ముడి సరుకు అవసరం. ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్ట ర్ ఎన్ లింగయ్య బృందం డెవలప్ చేసిన కాటలిక్ విధానం ద్వారా తక్కువ పరిమాణంతోనే సులభం గా వినియోగించుకునేలా టైవ్ (TAIW)ను ప్రాసెసింగ్ విధానాన్ని డెవలప్ చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా ఇతర దేశాలపై భారత్ ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి సాధించేందుకు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.