హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. మంగళవారం పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి హైదరాబాద్లోని సోమేష్ కుమార్ నివాసంలో మినాక్షి సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.