హైదరాబాద్ : స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వజ్రోత్సవ ఉత్సవాలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 8న ప్రారంభోత్సవ సభకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని స్పష్టం చేశారు. దేశ సమైక్యతను పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే కోటి జెండాల పంపిణీకి సిద్ధంగా ఉందని సీఎస్ స్పష్టం చేశారు.