హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ అయినా ఇంకా విధుల్లో కొనసాగుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం వేటువేసింది. వారందరినీ తొలగించాలని ఆదేశించింది. సచివాలయంతోపాటు అన్ని శాఖలు, ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లు, ఏజెన్సీలలో ఎక్స్టెన్షన్, రీఅపాయింట్మెంట్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సిబ్బందిని ఈ నెల 31లోగా తొలగించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిశాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 177 మందిని తొలగించాలని ప్రభుత్వ అదనపు కార్యదర్శి సైదా గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
రామగిరి , మార్చి 27 : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. పరీక్షల విభాగం పరిసరాలు మొదలుకుని ఇంజినీరింగ్ కళాశాల వరకు 120 ఎకరాల్లో ఉన్న చెట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.