హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిరుడితో పోలిస్తే నికరసాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి వనరులలో లభ్యత చాలా సౌకర్యంగా ఉందని, యాసంగి సీజన్‌కు సరిపడా నీళ్లు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ మాట్లాడుతూ రానున్న పది రోజులలో విద్యుత్తు, నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలని సూచించారు. విద్యార్థుల హాస్టళ్లపైనా సీఎస్ సమీక్షించారు. మెరుగైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.