హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాబోయే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ సంజయ్‌జాజు మాట్లాడుతూ 26 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా జిల్లాల్లో విత్తన మేళాలు కొనసాగుతున్నాయని తెలిపారు.