హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ) : అన్ని శాఖలకు సంబంధించి ఒక ఉన్నతాధికారి పూర్తి వివరాలతో అసెంబ్లీలో కచ్చితంగా అందుబాటులో సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం అన్ని శాఖల అధికారులు అసెంబ్లీ లాబీలో ఫైళ్లతో కనిపించారు. ఇందుకు కర్ణాటక అసెంబ్లీ ఘటనే కారణమని ఓ అధికారి తెలిపారు.
రెండు రోజుల క్రితం ఆ రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వకపోవడంతో స్పీకర్ యూటీ ఖాదర్ సభను వాయిదా వేసి వాకౌట్ చేశారు. మంత్రులు, ఆ శాఖల కార్యదర్శులు వివరణ ఇచ్చేవరకు తాను సభను నడుపబోనని తేల్చిచెప్పారు.