హైదాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : గోదావరి పుషరాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. పుషరాల ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి బాసర, భద్రాచలం వరకు 8 జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతం ఉన్నందున భక్తులు తరలివస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అందుకు ప్రతిపాదనలు రూపొందించి క్యాబినెట్ సబ్‌కమిటీకి సమర్పించాలని ఆదేశించారు.