భద్రాచలం, జనవరి 1 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల(సీఆర్టీలు) నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రాచలం ఐటీడీఏ (Bhadrachalam ITDA) పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలు బుధవారం ఒంటికాలిపై నిల్చొని నిరసన(CRTs protest) తెలిపారు. తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం ఐటీడీఏ ఎదుట సీఆర్టీలు చేపట్టిన నిరసన దీక్షలు 13వ రోజుకు చేరాయి.
ఈ సందర్భంగా పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ ఏళ్లతరబడి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని, హైకోర్టు ఇచ్చిన మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఆర్టీల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రవికుమార్, జిల్లా నాయకులు రాజేశ్, భాస్కర్, భూక్యా కోటయ్య, సురేశ్, సక్రు, మహిళా అధ్యక్షురాలు సరస్వతి, రూప, నిర్మల, కమలాజ్యోతి, వెంకట్, పాంచాలి, రాష్ట్ర, జిల్లా మహిళా నాయకులు నిర్మల, సునీత, వెంకటరమణ, బుచ్చయ్య, నర్సింహారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.