హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 9 : మనస్తాపంతో సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెరమండ్ల రాజ్‌కుమార్ (39) జార్ఖండ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దసరా సెలవుల కోసం కాట్రపల్లి గ్రామానికి వచ్చాడు.
బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావు విషయాన్ని ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు తెలియజేయాలని సూసైడ్ నోట్లో పేరొన్నాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, తన తల్లిదండ్రులు, కూతురిని బాగా చూసుకోవాలని కోరాడు. కాగా, రాజ్‌కుమార్ రెండు రోజులుగా మానసిక ఒత్తిడితో ఉంటున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. రాజ్‌కుమార్‌కు భార్య రాధిక, రెండేళ్ల కూతురు శ్రీనిఖ ఉంది.