HYDRA | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అం డ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఈ పేరు వింటేనే జీహెచ్ఎంసీతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజ లు ఉలిక్కి పడుతున్నారు. ఆస్తుల రక్షణ పేరు తో పెద్దపెద్ద భవనాలను కూలగొడుతుండటం తో ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల పట్టాలను మరోసారి చెక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా శివా రు ప్రాంతాల ప్రజలు కలవరపడుతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కట్టుకొనో, కొనుక్కొనో ఏండ్ల తరబడి నివాసం ఉంటున్నా ఇప్పుడు నిరాశ్రయులు కాక తప్పదా? అని ఆవేదన చెందుతున్నారు.
భవనాలు నేలమట్టం
రాష్ట్ర ప్రభుత్వం గత నెల 17న హైడ్రాను ఏర్పాటు చేస్తూ జీవో 99ని జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు, 61 పారిశ్రామిక వాడలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ను హైడ్రాకు అప్పగించింది. జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల పరిధిలోని పారులు, లే అవుట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల స్థలాలను పరిరక్షించడం అస్సెట్ ప్రొటెక్షన్ వింగ్ బాధ్యత. ఆయా స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించడం, విచారణ చేపట్టడం, ఆక్రమణలను అడ్డుకోవడం, చెరువులను కబ్జాల నుంచి రక్షించడం వంటి బాధ్యతలను దీనికి అప్పగించింది.
ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకొని వందల భవనాలను కూలగొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఏండ్ల కిందట వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి, ఇండ్లు కట్టుకున్నవారు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. తాము కొన్న స్థలం ఏదైనా ప్రభు త్వ స్థలం పరిధిలోకి వస్తుందా? అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటున్నారు. దశాబ్దాలుగా రియల్టర్ల నుంచి అడ్డగోలు లంచాలు తీసుకొని అధికారులు విచ్చలవిడిగా వెంచర్ల కు అనుమతులిచ్చేస్తున్నారన్న విమర్శలు ఉ న్నాయి. ప్రభుత్వ స్థలాలు, చెరువు శిఖం భూ ముల్లో వెంచర్లు వేసినా నిస్సిగ్గుగా అనుమతు లు మంజూరు చేశారు. ఇదే అదనుగా చెరువు లు, కుంటలు, పార్కుల స్థలాలను కబ్జా చేసి, మట్టి నింపి పూడ్చివేసి, వెంచర్లు వేసి అమ్మేశారు. సామాన్యులకు ఈ విషయం తెలియ దు. అన్ని రకాల అనుమతులు ఉండటంతో లక్షలు పోసి స్థలాలు కొని ఇండ్లు కట్టుకున్నా రు. ఇప్పుడు వారంతా భయపడుతున్నారు.
అధికారులపై చర్యల్లేవా?
‘అక్రమ నిర్మాణాలు’ అంటూ హైడ్రా ఆధ్వర్యంలో భవనాలను కూల్చివేస్తున్న ప్రభుత్వం, వాటికి అనుమతులిచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు నిబంధనలు ఎందుకు రూపొందించలేదని నిలదీస్తున్నారు. ఒక భవనాన్ని కూల్చివేసే ముందే ఆ ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అన్ని విభాగాల అధికారులకు నోటీసులివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారి నుంచి వివరణ తీసుకొని, తగిన శిక్ష విధించిన తర్వాతే భవనాలు కూల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
హైడ్రా పరిధిలోకి వచ్చేవి ఇవే మున్సిపల్ కార్పొరేషన్లు
మున్సిపాలిటీలు
గ్రామ పంచాయతీలు
ఇతర ప్రాంతాలు