హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ప్రపంచం నలుమూలల నుంచి తెలంగాణకు పెట్టుబడులను తీసుకురావటంలో తనకు తానే సాటి అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి నిరూపించారు. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి దిగ్గజ కంపెనీల నాయకత్వాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను వివరిస్తున్నారు. దీంతో పర్యటన మొదటిరోజు నుం చే అనేక కంపెనీలు పెట్టుబడుల ప్రకటనలు చేయటం ప్రారంభమైంది. మొదటిరోజు లండ న్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు ప్రకటన చేయగా, రెండోరోజు శనివారం అనేక కంపెనీలు ముందుకొచ్చాయి.
యూకేకు చెందిన ప్రముఖ కెమికల్స్ త యారీదారు క్రొడా ఇంటర్నేషనల్ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక గ్లోబల్ టెక్నికల్ సెంటర్ (జీటీసీ) ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ పీఎల్సీ లైఫ్ సైన్సెస్ ప్రెసిడెంట్ డేనియల్ పియర్జెంటిలి శనివారం భేటీ అయ్యారు. క్రొడా సంస్థను 1925లో స్థాపించారు. ఈ సంస్థ గ్లోబల్ టెక్నికల్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంతో భారతదేశ ఫార్మసీ రంగానికి మరింత ఉతం లభించనున్నది
దేశానికి తెలంగాణ మాడల్ అత్యవసరమని మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయం లో భారత్‌లో తెలంగాణ రాష్ట్రమే మొదటిస్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. యూకే పర్యటనలో భాగంగా లండన్‌లో శనివారం నిర్వహించిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా-2023’ అం తర్జాతీయ సదస్సులో కేటీఆర్ ప్ర సంగించారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం అద్భుత పురోగతి సాధించిందని తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. ‘భారతదేశానికి అనేక సహజసిద్ధ అవకాశాలు, ప్రయోజనాలు, సహజ, ఖని జ వనరులు, నదులు, ఉప నదులు, నీటి సం రక్షణ కేంద్రాలున్నాయి. అయితే వీటన్నింటికంటే అత్యంత ముఖ్యమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికైనా మనం సరైన ప్రణాళికతో ముందుకెళ్తే చైనా 30 ఏం డ్లలో సాధించింది భారతదేశం 20 ఏండ్లలో సాధించగలదు. జనాభాలో 67% 15- 64 ఏండ్ల మధ్యవారే ఉన్నారు.
ఈ మానవ వనరులను వినియోగం చేసుకోవాలి. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్ర త్యామ్నాయ ఉపాధి మార్గాలను సృష్టించేందు కు యువతకు శిక్షణ ఇవ్వాలి. తెలంగాణ గతం లో కరువు ప్రాంతంగా ఉండేది. రైతులు నీటి కోసం అనేక బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోయా రు. కొన్నిసార్లు ఆర్థిక భారం కారణంగా రైతు లు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఫ్లోరోసిస్ సమస్యతో బాధ పడ్డారు. రాష్ట్రంగా ఏర్పడిన తరువాత పంట పొలాలతో తెలంగాణ పచ్చగా మారింది. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచింది’ అని వివరించారు.
స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రసిద్ధిగాంచిన డీఏజెడ్ఎన్ సంస్థ హైదరాబాద్‌లో తమ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని శనివారం ప్రకటించింది. లండన్‌లో మంత్రి కేటీఆర్‌తో డీఏజెడ్ఎన్ గ్రూప్ ప్రధాన టెక్నాలజీ అధికారి సందీప్ టికు, ఈవీపీ కమ్యూనికేషన్స్ బోర్డు మెంబర్ డై సీ వెల్స్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇందుకు అవగాహన ఒప్పందం కుదిరిం ది. ఈ సంస్థ అంతర్జాతీయ ఓవర్-ది-టా ప్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సర్వీస్ (ఓటీటీ) సంస్థ.
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు అత్యధికంగా చూసే యూఈఎఫ్ఏ ఛాంపియ న్స్ లీగ్, యూరోపా లీగ్, సెరీ ఏ, లా లిగా, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, ఎన్ఎఫ్ఎల్, ఎన్బీఏతో పాటు ఐపీఎల్ విదేశీ ప్రసారాలను, ఆన్-డిమాండ్ కంటెంట్‌ను ఈ సంస్థ అందిస్తుంది. హైదరాబాద్‌లో ఈ సంస్థ ఏర్పాటుచేసే కేంద్రంలో వెయ్యికిపైగా ఉద్యోగాలు వస్తాయని కంపెనీ తెలిపింది. ఇన్నోవేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న ఆధిపత్యానికి డీఏజెడ్ఎన్ పెట్టుబడే నిదర్శనమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల ము ఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ కొణతం దిలీప్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఆత్మకూరి పాల్గొన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి బ్రిటన్‌లోని అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ సీవో వో డేవిడ్ బ్లాట్ శనివారం భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించగా, సంస్థ ప్రతినిధులు పెట్టుబడులు పెట్టడానికి సు ముఖత వ్యక్తంచేశారు. లాయిడ్స్ బ్యాకింగ్ గ్రూప్ 2009 ఏర్పాటైంది. ఈ సంస్థకు 30 లక్షల మంది వినియోగదారులున్నారు. యూరప్, అమెరికా, ఆసియా దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. హాలెన్ సంస్థ ఉపాధ్యక్షుడు డామియన్ పొటర్తో కూడా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వినియోగదారుల ఆరోగ్య రంగంలో హాలెన్ సంస్థకు బ్రిటన్‌లో మంచి పేరున్నది. సుమారు 40.58 బిలియన్ డాలర్ల్ల వ్యాపారం చేస్తున్న ఈ సంస్థలో సంస్థలో 22 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆరోగ్యరంగంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సమావేశం సందర్భంగా హాలెన్ సంస్థ ప్రకటించింది.
గ్రీన్‌జెట్స్ సంస్థ భారత డ్రోన్ మారెట్లోకి ప్రవేశించడానికి తెలంగాణను ఎంచుకొన్నది. నేషనల్ సెంటర్ ఆఫ్ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్‌తో 2023లో ఇంక్యుబేట్ చేసే ఒక అవగాహన ఒప్పందంపై సం తకం చేసింది. ఈ సంస్థ 2024లో ఆర్అం డ్డీ, మాన్యుఫ్యాక్చరింగ్ ఫుట్‌ప్రింట్‌ను పెంచుకోవాలని యోచిస్తున్నది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్‌జెట్స్ ఇండియన్ ఆపరేషన్స్ స్థాపనపై ప్రతినిధి బృందం మంత్రికి వివరించింది. గ్రీన్జెం ట్స్ ఏరోస్పేస్ కంపెనీ సీఈవో అనుమోల్ మనోహర్ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యా రు. సంస్థ కార్యక్రమాలకు సర్కారు అండ గా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.