పెబ్బేరు, ఆగస్టు 6: వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేటలో మంగళవారం ఓ ఇంట్లోకి మొసలి వచ్చింది. గ్రామానికి చెందిన నాగన్న ఇంటి వద్ద మంగళవారం తెల్లవారుజామున కుక్కలు పెద్దగా అరిచా యి. నాగన్న నిద్రలేచి చూడగా బాత్రూం పక్కనే మొసలి కనిపించింది.
వెంటనే 100కు ఫోన్ చేయగా పోలీసులు, సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్ అక్కడకు చేరుకొని మొసలిని బంధించారు. అటవీ శాఖ అధికారి రాణి సమక్షంలో కృష్ణానదిలో మొసలిని వదిలారు. రామసము ద్రం చెరువు నుంచి రావొచ్చని గ్రామస్తులు తెలిపారు.