పాన్గల్, అక్టోబర్ 17 : కుంటలో చేపల వలకు మొసలి చిక్కిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాన్గల్ మండలం మహమ్మదాపూర్ శివారులోని కేశనికుంటలో గురువారం రాత్రి చేపల కోసం మత్స్యకారులు వల ఏర్పాటు చేయగా.. మొసలి చిక్కింది.
శుక్రవారం ఉదయం గ్రామస్థులు సాగర్ స్నేక్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్కు సమాచారం అందించారు. ఆయన చేరుకొని వలలో చిక్కుకున్న మొసలిని సురక్షితంగా బయటకు తీశాడు.