Konda Surekha | హైదరాబాద్, నవంబర్ 21 (నమసే ్త తెలంగాణ): దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. కొండా సురేఖ, ఓ మహిళ మధ్య జరిగిన బండ బూతుల సంభాషణ అంటూ ఆ మధ్య ఓ ఆడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత స్వయంగా కొండా సురేఖ కెమెరాల ముందు అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి కేటీఆర్, సినీనటుడు నాగార్జున కుటుంబం గురించి ఇష్టారీతిన మాట్లాడటంతో హైకోర్టు మొట్టికాయలు వేసింది. నాగార్జున వేసిన పరువు నష్టం కేసు నడుస్తున్నది. ఇలా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న కొండా సురేఖ మరోసారి నెటిజన్ల చేతిలో బుక్కయ్యారు. సురేఖ మాట్లాడిన వీడియో కాల్ రికార్డుగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
అందులో ఓ యువతితో సురేఖ మట్లాడుతూ ఈ రోజు మా అందరికీ పండుగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నము.. చిన్న పాప పేరుతోటి. మా టీమ్ టీమంతా కూడా ఇవాళ ఫుల్ ఎంజాయ్. బిర్యానీ ఉంటే బీర్ ఉంటది కదమ్మా పాపము. అఫీషియల్ సెలేబ్రేషన్ అంటే అఫీషియల్‌గా ఇచ్చేది. ఇగ అన్అఫీషియల్గా అంటే.. అన్నారు. మరో వీడియోలో ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని చెప్తున్నా అన్నారు. మూడో వీడియోలో బిర్యానీలు నడుస్తున్నయి.. అట్లనే సల్లవడుడు కూడా నడుస్తున్నది అని మంత్రి మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియోలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సురేఖ ఇంటిలో పోలీసులు సోదాలు చేయాలని, పార్టీకి పర్మిషన్ ఉందా? మందు పార్టీనా? డ్రగ్స్ పార్టీనా? రేవ్ పార్టీనా? తేల్చాలని కొందరు పోస్టులు పెడుతున్నారు.