నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పరువు నష్టం కేసు నమోదు చేయాలంటూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. వ్యా పారవేత్త సూదిని సృజన్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖ లు చేశారు. అమృత్ టెండర్లపై ప్రజలను త ప్పుదారి పట్టించేలా కేటీఆర్ తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అమృత్-2లో ప్యాకేజీ-1 కాంట్రాక్టును ఏఎమ్మార్- శోధ- ఐహెచ్పీ జాయింట్ వెంచర్ దక్కించుకున్నదని, కేటీఆర్ చెప్తున్నట్టు ఆ వెంచర్లో శోధ కన్స్ట్రక్షన్స్కు 80% వాటా లేదని, కేవలం 29% మాత్రమే వాటా ఉన్నద ని తెలిపారు. శోధ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కందాళ దీప్తిరెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారని, ఆ సం స్థలో తనకు ఎలాంటి షేర్లు లేవని, తాను డైరెక్టర్‌ను కాదని వివరించారు. ఈ పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ జరుపనున్నది.