D Raja | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : దేశ సంపదలో 90 శాతం దళితుల శ్రమతోనే సృష్టించబడుతున్నా.. దళితులు, ఆదివాసీలు, అట్టడుగు శ్రామికవర్గాలు ఇంకా అణచివేతకు గురవుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆలోచనంతా అదానీ, అంబానీల కోసమేనని విమర్శించారు. హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో అఖిల భారత దళిత హకుల ఉద్యమం(ఏఐడీఆర్‌ఎం) జాతీయ రెండో మహాసభలను డీ రాజా సోమవారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మల్లెపల్లి లక్ష్మయ్య, చాడ వెంకటరెడ్డి, ఏఐడీఆర్‌ఎం జాతీయ అధ్యక్షుడు రామ్మూర్తి, రాధాకృష్ణన్, ఎమ్మెల్యే గడ్డం వివేక్, బాలనరసింహ, వీఎస్ నిర్మల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.