హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): సీపీఎస్‌ను రద్దుచేయాలని, పాత పింఛన్‌ను పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) ఆదివారం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని తలపెట్టింది. లక్ష మంది ఉద్యోగులతో ఎల్బీస్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ వెల్లడించారు. సీపీఎస్ఈయూ నిర్వహించే సభకు పోలీసులు మొదట అనుమతించలేదు. దీంతో సంఘం నేతలు శుక్రవారం హైకోర్టును ఆశ్రయించగా.. ఎట్టకేలకు హైకోర్టు అనుమతి మంజూరుచేసింది.