హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న అనేక హామీల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీ మ్ రద్దు కూడా ఒకటి. ఉద్యోగుల ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తాం.. పాత పిం ఛన్ను పునరుద్ధరిస్తాం’ అని గద్దెనెక్కి రెండున్నరేండ్లు దాటినా హామీని నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్‌ఫై సీపీఎస్ ఉద్యోగులు సమరశంఖం పూరించనున్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 11 నుంచి జనజాగరణ యాత్ర తలపెట్టారు. భద్రాచలం నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నట్టు తె లంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ తెలిపారు. రెండు విడతల్లో యాత్ర కొనసాగనున్నట్టు చెప్పారు. మొదటి విడత 11న భద్రాచలంలో ప్రారంభమై 31న యాదగిరిగుట్టలో ముగుస్తుందని వెల్లడించారు. ఆగస్టు 3నుంచి 18 వరకు మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రెండో విడత యాత్రను తలపెట్టనున్నట్టు చెప్పారు. రెండు విడతలు ముగిసిన తర్వాత ఆగస్టు 23న చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని, లక్ష మందితో భారీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.
జన జాగరణ యాత్రలో భాగంగా రాష్ట్రం లో ఉన్న 2.6 లక్షల సీపీఎస్ ఉద్యోగులందర్నీ కూడగడుతామని స్థితప్రజ్ఞ తెలిపారు. మొదటి విడతలో 30 జిల్లాలు, రెండో విడతలో మూ డు జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుందని స్పష్టంచేశారు. యాత్రలో భాగంగా ఆయా జిల్లాల్లో ని ఉద్యోగ, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ, ప్ర జా సంఘాల ప్రతినిధుల మద్దతు కోరడంతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. పం జాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమా చల్ ప్రదేశ్‌లో సీపీఎస్‌ను రద్దుచేశారు. కర్ణాటక, తెలంగాణలో రద్దుకు హామీ ఇచ్చారు. కానీ, తెలంగాణలో ఒక్క అడుగూ ముం దుకు పడనందున యాత్ర చేపట్టినట్టు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. 2004లో అప్పటి రాజశేఖర్‌రెడ్డి సర్కార్ 2004 సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి సీపీఎస్‌ను వర్తింపజేస్తూ జీవో-653ని జారీ చేసింది. ఈ మేరకు ఏపీ పెన్షన్ రూల్స్ 1980ని అప్పటి ప్రభుత్వం సవరించింది. ఈ ఒక్క నిర్ణయంతో రాష్ట్రంలోని ఉ ద్యోగులందరినీ రోడ్డున పడేసింది. ఈ పాపానికి ఒడిగట్టిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి కొత్త మోసానికి తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు సీపీఎస్‌ను రద్దుచేస్తామని హామీనిచ్చింది. ఏకంగా అభయహస్తమంటూ మ్యానిఫెస్టోలో పెట్టింది. కానీ, ఇంతవరకూ అమలు చేయలేదు.