హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) పార్టీతో పొత్తుల వ్యవహారం బెడిసికొట్టడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని సీపీఎం (CPM) నిర్ణయించింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా సీట్ల వ్యవహారాన్ని తేల్చకపోవడంతో తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ క్రమంలో నేడు అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అభ్యర్థుల పేర్లను విడుదల చేయనున్నారు. ఆయన ఖమ్మం జిల్లా పాలేరు (Paleru) నుంచి పోటీయనున్నారు. అయితే మరో కమ్యూనిస్టు పార్టీ సీపీఐ.. కాంగ్రెస్తో కలిసే ఎన్నికల్లో పోటీ చేయనుంది.
కాగా, బీజేపీ-జనసేన (Janasena) మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పవన్ కల్యాణ్ పార్టీకి 8 స్థానాలు కేటాయించడానికి బీజేపీ (BJP) అధినాయకత్వం ఓకే చెప్పింది. మరో రెండు స్థానాల్లో స్పష్టం రావాల్సి ఉన్నది. దీంతో ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వరావుపేట, తాండూరు, కోదాడ, నాగర్కర్నూల్, కూకట్పల్లి స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది.