మధిర/ముదిగొండ, జనవరి 3 : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్క ప్రోద్బలంతోనే మధిర నియోజకవర్గంలోని సీపీఎం శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. శనివారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేదర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మధిరలో సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్యకు సంబంధించిన కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.