రామగిరి/ ఇల్లెందు రూరల్/ బోనకల్లు, మార్చి 28 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఎం నాయకు లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బోనకల్లు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా కమిటీ సభ్యుడు చింతలచెరువు కోటేశ్వరరావు మాట్లాడుతూ హామీల అమలుకోసం సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. అన్ని రకాల వడ్లను మద్దతు ధరకు కొ నుగోలు చేసి వెంటనే బోనస్ చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ స భ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఇల్లెందు మండలంలోని సీఎస్పీ బస్తీ రాజీవ్‌నగర్ కాలనీలోని గుడిసెవాసులకు తా గునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఇల్లెందు మండలం కోరగుట్టపై ఉన్న మిషన్ భగీరథ కార్యాలయాన్ని కాలనీవాసులు ముట్టడించారు. ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు.