హైదరాబాద్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి సీపీఐ మద్దతు ప్రకటించిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తెలిపారు.
సోమవారం ఏపీలో పర్యటించిన ఆయన ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని ఆయన తెలుగు రాష్ర్టాల ఎంపీలను కోరారు.