ఖలీల్వాడీ, ఏప్రిల్ 1: దేశంలో అప్రకటిత ఎమర్జె న్సీ కొనసాగుతు న్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సీపీఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కూనంనేని మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు.