హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు ఆగస్టు 19 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లోని మహారాజ గార్డెన్లో మహాసభలు జరుగనున్నట్టు చెప్పారు. బుధవారం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలకు జాతీయ నేతలు, రాష్ట్రంలోని 1,000 మంది పార్టీ ప్రతినిధులు హాజరై, ప్రజాసమస్యలు, పౌ రులకు రాజ్యా ంగం కల్పించిన ప్రాథమిక హకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించనున్నట్టు తెలిపారు. భవిష్యత్ పోరాటాల తీర్మానాలకు మహాసభ వేదిక కానుందన్నారు. మహాసభల విజయవంతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు కరపత్రాలు పంచి, మహాసభల విజయవంతానికి హార్థిక, ఆర్థిక సహాయ సహకారాలు తీసుకోవాలని, ప్రజలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.