హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మునుగోడులో ఘర్షణలు సృష్టించడం ద్వారా ఉప ఎన్నికను రద్దు చేయించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలింగ్‌కు గట్టిబందోబస్తు ఏర్పాటుచేయాలని మంగళవారం భారత ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు.
గత రెండు రోజుల్లో అంకిరెడ్డిగూడెం, పలివెలలో దాడులను వివరించారు. ఇదే తరహా ఘర్షణలకు బీజేపీ నాయకులు పాల్పడితే ఓటు హక్కును వినియోగించుకొనే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తంచేశారు.