హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): సీపీఐ వందేండ్ల ఉత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించనున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈనెల 18న ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కశాశాల గ్రౌండ్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు సీఎం రేవంత్రెడ్డి, వామపక్ష పార్టీ అగ్రనేతలతోపాటు సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.